Monday, April 29, 2024
- Advertisement -

టీమిండియా కొత్త‌ జెర్సీ వ‌చ్చేసింది…

- Advertisement -
BCCI unveils new jersey for Team India ahead of Champions Trophy 2017

భారత క్రికెటర్లు ఇప్ప‌టి నుంచి కొత్త జెర్సీని ధ‌రించ‌నున్నారు. ఇన్నాల్లు స్టార్ గుర్తుఉన్న జెర్సీకి బీసీసీఐ మంగ‌లం పాడింది. . ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, ఒప్పో మొబైల్‌ ఇండియా అధ్యక్షుడు స్కై లి నూతన జెర్సీని ఆవిష్కరించారు. ఇక నుంచి ఆటగాళ్ల జెర్సీలపై స్టార్‌ ఇండియా స్థానంలో ఒప్పో ప్రత్యక్షం కానుంది.

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ ఒప్పోతో బీసీసీఐ ఐదు సంవత్సరాలకు గాను రూ.1,079కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. జెర్సీ హక్కుల కోసం నిర్వహించిన వేలంలో స్టార్‌ ఇండియాను… ఒప్పో అధిగమించింది.టీమ్ ఇండియాకు ఒప్పో మొబైల్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత ఓవర్ల సమయంలో ధరించే జెర్సీలను విడుదల చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బీసీసీఐ భారత జట్టును ఛాంపియన్స్‌ ట్రోఫీ- 2017కి పంపితే కొత్త జెర్సీలతో భారత జట్టును చూడవచ్చు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతూ… ‘భారత క్రికెట్‌ కుటుంబంలోకి ఒప్పోను ఆహ్వానిస్తున్నాం. బీసీసీఐ- ఒప్పో ఒప్పందం 2022 మార్చి వరకు కొనసాగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఇంకా టీమ్ ను ప్రకటించలేదు. రెవెన్యూ పంపకం విషయంలో ఐసీసీతో తలెత్తిన వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొంటే… ఈ కొత్త జెర్సీని మన ఆటగాళ్లు ధరిస్తారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. చాంపియన్స్ ట్రోఫీపై వీడ‌ని ఉత్కంఠ‌…
  2. ప్రతి సీజన్‌లోనూ 300 పైచిలుకు పరుగులు
  3. ఐసీసీ బిగ్‌-3 ఆదాయ పంపిణీ కోల్పోయిన బీసీసీఐ
  4. 2022 లో కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో..క్రికెట్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -