పాక్‌కు బందీగా చిక్కిన భారత పైలెట్ అభినందన్ వర్థమాన్ కోసం యావత్ భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు కాఘూ సరిహద్దవైపే. మరికొన్ని గంటల్లో సొంతగడ్డపై అడుగుపెట్టబోతున్నారు. అభినందన్‌ను విడుదలపై భారత్‌లో సంబరాలు జరుపుకుంటున్నారు. అభినందన్‌ను విడుదళ చేస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాఘా సరిహద్దు దగ్గర అభినందన్ ను స్వాగతం పలికేందుకు భారత బలగాలు ఏర్పాట్లు చేశారు. అమృత్ సర్ లో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేందుకు తనకు అవకాశమివ్వాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధానిని కోరారు. అభినందన్‌కు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దు దగ్గరకు చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. పాక్ వాఘా సరిహద్దు ద్వారా అభినందన్‌ను భారత్‌కు అప్పగించబోతున్నారు.
- Advertisement -
అభినందన్ కోసం ఎదురుచూస్తున్న యావత్ భారత్..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -