Saturday, April 27, 2024
- Advertisement -

ఆసీస్ పై భారత్ ఘనవిజయం…!

- Advertisement -

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఇండియా Vs ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఆసీస్ పై టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ టీమిండియా బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది.

టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లతో కంగారూలను హడలెత్తించారు. జడేజా 2 వికెట్లు తీయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 26, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. లబుషేన్ (15), గ్లెన్ మ్యాక్స్ వెల్ (8), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5), ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (12) విఫలమయ్యారు.

189 టార్గెట్‌ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 5 వికెట్ల తేడాతో తొలి వన్డేను కైవసం చేసుకుంది. లక్ష్యచేధనలో మొదట కాస్త తడబడిన టీమిండియా ఇషాన్(3), కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్(0), గిల్(20) వికెట్లు తరువాత బరిలోకి దిగిన రాహుల్(75), జడేజా(45) 39.5 ఓవర్లలో భారత్ ను గెలిపించారు. ఆసీస్ స్టార్క్ ౩, స్టాయినీస్ 2 వికెట్లు తేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -