చైనాకు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆరుణాచల్ ప్రదేశ్‌లో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించిన సంగతి తెలిసిందే. మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడాన్ని కూడా తప్పుబట్టింది. అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చైనా వ్యాఖ్యలకు దిమ్మతిరిగె సమాధానం ఇచ్చింది భారత్.
భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని… భారతదేశ నేతలు, ప్రజలు, అధికారులు ఎవరికైనా, ఎప్పుడైనా సరే అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించే అధికారం ఉంటుందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ దేశంలో ఒక రాష్ట్రమైన అరుణాచల్ లో పర్యటించే స్వేచ్ఛ, హక్కు తమ ప్రజలకు ఉంటుందని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో చైనా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తినా… పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
డోక్లాం సమస్య సద్దుమనిగాక ఇప్పుడు మరో సారి ఇరు దేశాల మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. దక్షిణ టిబెట్ లో అరుణాచల్ ప్రదేశ్ భాగమన్న చైనా వ్యాఖ్యలు హస్యాస్పదమని తెలిపింది. అలాగే చైనా నిర్మిస్తున్న ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ విషయంలో కూడా భారత్ కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది.