Tuesday, May 6, 2025
- Advertisement -

అగ్ని5 ఖండాత‌ర క్ష‌ప‌ణి ప్ర‌యోగం విజ‌య‌వంతం ..

- Advertisement -

భారత్‌ గురువారం ఉదయం అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం దీవుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అణు సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి చైనాలోని చాలా ప్రాంతాలను భస్మీపటలం చేయగలదు.

అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. 2016 డిసెంబర్‌ 26న అగ్ని-5 క్షిపణీ నాలుగో దఫా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్షిపణినీ విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్రువీకరించారు. గురువారం అగ్ని-5 క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించి చూసినట్టు తెలిపారు.

5000 కిలోమీటర్ల స్ట్రైక్‌ రేంజ్‌ గల ఈ క్షిపణి చైనాలోని ఉత్తర ప్రాంతాల వరకు చేరుకోగలదు. ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. డీఆర్డీఓ తయారుచేసిన ఈ క్షిపణి 1.5టన్నుల అణు వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. 17.5మీటర్ల పొడవైన అగ్ని-5 సుమారు 50 టన్నుల బరువు ఉంటుంది.

అగ్ని-5ని 2012 ఏప్రిల్‌లో, 2013 సెప్టెంబరులో, 2015జనవరిలో చివరగా 2016 డిసెంబరులో పరీక్షించారు. ఈ క్షిపణిని ప్రవేశపెట్టిన అనంతరం భారత్‌ ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే సరసన చేరనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -