Friday, May 17, 2024
- Advertisement -

వివాహాలు చేసుకున్నజ‌హీర్‌, భువి

- Advertisement -

భార‌త క్రికెట్ జ‌ట్టులో పెళ్లి సంద‌డి ఏర్ప‌డింది. ఇన్నాళ్లుగా ఉన్న బ్ర‌హ్మచారులు త‌మ తోడును వెతుక్కున్నారు. భార‌త జ‌ట్టులో సీనియ‌ర్ బౌల‌ర్‌గా జ‌హీర్‌ఖాన్ రాణించాడు. ఇప్పుడు కెరియ‌ర్ ముగింపు ద‌శ‌లో ఉన్నాడు. ఇప్పుడు మ‌న జ‌ట్టులో ప్ర‌ధాన పేస‌ర్ ఎవ‌రంటే అంద‌రూ భువ‌నేశ్వ‌ర్ అనే చెబుతారు. వీరిద్ద‌రూ త‌మ ప్రేయ‌సుల‌ను గంట‌ల వ్య‌వ‌ధిలో వివాహ‌మాడారు. ఒక‌రేమో సాదాసీదాగా రిజిస్ర్టేష‌న్ వివాహం చేసుకోగా.. మ‌రొక‌రు అంగ‌రంగ వైభ‌వంగా భాజాలు మోగిస్తూ పెళ్లి చేసుకున్నారు. వారిద్ద‌రే సీనియ‌ర్ బౌల‌ర్ జ‌హీర్‌ఖాన్‌, ప్ర‌స్తుత ప్ర‌ధాన బౌల‌ర్ భువి.

జ‌హీర్‌ఖాన్ త‌న ప్రేయ‌సి, బాలీవుడ్ న‌టి సాగ‌రిక‌ను ముంబైలోని ఓ కోర్టులో రిజిస్ర్టేష‌న్ వివాహం చేసుకున్నాడు. వీరు న‌వంబ‌ర్ 27వ తేదీన ముంబైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌నున్నారు. ఈ వేడుక‌కు చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ త‌న ప్రేయ‌సి నుపూర్‌ను నాగ్‌పూర్‌లో సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో గురువారం వివాహం చేసుకున్నాడు. భువి పెళ్లి వేడుక‌పై త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియాలో స్పందించారు. అయితే పెళ్లి వ‌ల‌న భువి రెండు టెస్టుల‌కు దూర‌మ‌య్యాడు. భువి పెళ్లి వేడుక‌కు భార‌త జ‌ట్టు దూరంగా ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ కొన‌సాగుతుండ‌డంతో పెళ్లికి రాలేక‌పోయారు. వీరికి త్వ‌ర‌లో భువి పెద్ద పార్టీ ఇస్తాడ‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -