- Advertisement -

స్పెషల్ ఆఫర్.. రూ.899కే ఫ్లైట్ టికెట్..!

- Advertisement -

విమానంలో ప్రయాణించాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందుకు తగ్గ డబ్బులు లేక బస్సులోనో.. రైలులోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి శుభవార్త. అదిరిపోయే ఆఫర్ ఇప్పుడు ఒకటి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

ఇందులో భాగంగా కేవలం రూ.899కే విమాన టికెట్ పొందొచ్చు. దేశీ విమాన ప్రయాణానికి ఫ్లైట్ టికెట్ ధర రూ.899 నుంచి ప్రారంభమౌతూంటే.. అదే అంతర్జాతీయ విమాన ప్రయాణానికి టికెట్ ధర రూ.2,999 నుంచి ప్రారంభమౌతోంది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇండిగో ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.

ఆఫర్‌లో భాగంగా టికెట్లు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. సీట్లు అందుబాటులో ఉన్నంత వరకే ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అలానే ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలానే ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకుంటే ఎలాంటి కన్వీనియన్స్ చార్జీలు ఉండవని ఇండిగో తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -