Saturday, May 4, 2024
- Advertisement -

కన్నడ సినిమా స్ఫూర్తితో .. బిక్షగాడిని ఎన్నికల పోటీలో ..!

- Advertisement -

కర్ణాటక మైసూర్​ జిల్లాలోని నంజనగుడ ప్రాంతంలో ఓ యాచకుడు ఈ సారి జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. గ్రామంలో అభివృద్ధిని కోరుతూ ఇలా వినూత్నంగా అతడితో నామినేషన్​ వేయించేందుకు సన్నద్ధమయ్యారు ఆ ఊరి ప్రజలు. విష్ణువర్ధన్​ కథానాయకుడిగా నటించిన ‘సింహాద్రీయ సింహ’ కన్నడ సినిమా స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఈ మేరకు అంకంకయక అనే ఓ యాచకుడ్ని ఎన్నుకొన్నారు బొక్కహల్లి ప్రజలు. రోజూ భిక్షాటన ద్వారా కడుపు నింపుకునే అతడు.. బస్టాండ్​లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడట. ఏళ్ల తరబడి ఇలాగే బతుకీడుస్తున్న అంకంకయక.. ఆ ఊరి ప్రజల వినూత్న ఆలోచనతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. నామినేషన్ వేసేందుకు ఓ కారును సిద్ధం చేసి.. దర్జాగా అతడ్ని సాగనంపారు స్థానికులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -