Tuesday, May 14, 2024
- Advertisement -

అదృష్టం అంటే ధోనీదే….

- Advertisement -

ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజ‌యం సాధించింది. ఈ మ్యాచులో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న చెన్నై కెప్టెన్‌ ధోని(75 నాటౌట్‌; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. వెంటనే ఔటయ్యే వాడే. కానీ బంతి స్టంప్స్‌ను తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో బతికిపోయిన ధోనీ.. తర్వాత కుదురుకొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేయడంతో పాటు.. ‘ తాలా ధోని ఎఫెక్ట్‌? బెయిల్స్‌ కూడా కిందపడటానికి నిరాకరించిన వేళ ’అంటూ క్యాప్షన్‌ జత చేసింది. అదృష్టం అంటేనే ఇదేనేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -