Monday, May 6, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3లో ఆ ఇద్ద‌రు.. ఇక ర‌చ్చ ర‌చ్చే…!

- Advertisement -

బిగ్ బాస్ 3’ కార్య‌క్ర‌మానికి రంగం సిద్దం అయ్యింది. ఈ సీజ‌న్‌కు హోస్ట్‌గా నాగార్జు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నె సంగ‌తి తెలిసిందే. అయితే అఫిషియ‌ల్‌గా నాగ్‌ను ప్ర‌క‌టించ‌డానికి సిద్దం అవ‌డ‌మే కాకుండా నాగ్ తో ఫైనల్ రౌండ్ చర్చలు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. బిగ్ బాస్ 2కి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో బిగ్‌బాస్ 3ని కూడా హిట్ చేసేందుకు స్టార్ యాజ‌మాన్యం క‌స‌ర‌త్తులు ప్రారంభించింది.

అత్యంత భారీ బడ్జెట్ తో నిర్వహింపబోతున్న ఈకార్యక్రమం యాడ్ రెవిన్యూ పరంగా కూడ పూర్తిగా సక్సస్ కావడానికి అభ్య‌ర్ధుల ఎంపిక‌లో ఎక్క‌డా రాజీనీ ప‌డ‌కూడ‌దు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విజ‌య వంతం చేసేందుకు సుధీర్, ర‌ష్మిలు పార్టిసిపేట్ చేసేందుకు ఇద్ద‌రితో చ‌ర్చ‌లు జ‌ర‌పుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ ఒప్పుకుంటే వీరికి భారీ పారితోషికం ఇవ్వడానికి కూడ ఈషో నిర్వాహకులు ముందుకు వస్తున్నట్లు సమాచారం.

బుల్లితెరపై ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ రియాలిటీ షోకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనీ .. ఆసక్తిని పెంచుతారని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఈ ఇద్దరూ కూడా యాంకర్స్ గా ప్రోగ్రామ్స్ తో బిజీగా వున్నారు. అందు వ‌ల్ల ఇద్ద‌రు అంగీక రించ‌క పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.భారీ పారితోషికం చెల్లిస్తే ఓకే అనేసే అవకాశాలు ఎక్కువేననేది మరికొందరి మాట. మ‌రి వీరిద్ద‌రూ ఒప్పుకుంటె బిగ్‌బాస్ 3 ర‌చ్చ ర‌చ్చే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -