Wednesday, May 8, 2024
- Advertisement -

జ‌గ‌న్ కేబినేట్‌లో ఐటీ మినిస్ట‌ర్ ఎవ‌రంటె…?

- Advertisement -

న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రెండో సీఎంగా జ‌గ‌న్ ఈ నెల 30న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీ వ‌లె జ‌రిగిన ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు సాధించి అఖండ విజ‌యం సొంతం చేసుకుంది. అయితే జ‌గ‌న్ కేబినేట్‌లో మాత్రం మంత్రి ప‌దువుల‌కోసం ఆశావ‌హుల చాలా మందే ఉన్నారు.

అయితే కేబినేట్ కూర్పుపై ప్ర‌తిప‌క్ష టీడీపీ విమ‌ర్శ‌లు చేకుండా ముందు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. అవినీతి ఆరోప‌న‌లు ఉన్న వారిని దూరం పెట్టి మంత్రి వ‌ర్గంపై ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. సుప‌రిపాల‌న అందిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత‌ల‌కు మంత్రి వ‌ర్గంలో చోటిస్తార‌నె ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా అతి ముఖ్య‌మైన శాఖ ఐటీ శాఖ‌.

ఐటీ శాఖ మంత్రిగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి టీడీపీలో వివాదాల‌కు పెట్టింది పేరు అయిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచిన కొఠారు అబ్బ‌య్య చౌద‌రి పేరు వినిపిస్తోంది. ర‌జాకీయ అనుభం లేక‌పోయినా అబ్బ‌య్య చౌద‌రి ప్ర‌భాక‌ర్‌పై ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో సాధించి రికార్డుల‌కు ఎక్కారు.

లండ‌న్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఆయ‌న వైసీపీని యూర‌ప్‌, యూకే ప్రాంతాల్లో బ‌లోపేతం చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కూడా. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఈక్వేష‌న్‌, క్లీన్ ఇమేజ్ నేప‌థ్యంలో అబ్బ‌య్య చౌద‌రికి ఈ సారి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఐటీ రంగంలో సుదీర్ఘ‌మైన అనుభ‌వం అబ్బ‌య్య సొంతం. అలాగే ఆయ‌న‌కు యూర‌ప్‌లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్లో కొన్నింటి శాఖ‌లు అయినా ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తే ఏపీలో కొంత‌మంది యువ‌త‌కు అయినా ఉపాధి దొరుకుతుంది. అందుకే ఆయ‌న‌కు ఐటీ మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -