- Advertisement -

అమెరికా వైమానిక దాడుల్లో మరణం

- Advertisement -

ఉగ్రవాద సంస్ధ ఐఎస్ అగ్రనాయకుడు అబు బకర్ అల్ బగ్దాదీ మరణించారు. ఆదివారం తెల్లవారుజామున అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో అల్ బగ్దాదీ మరణించినట్లు ఐఎస్ సంస్ధ అధికారిక పత్రిక వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అమెరికా మాత్రం ఇంకా నిర్దారించకపోవడం గమనార్హం. అంతే కాదు.. వైమానిక దాడుల్లో పెద్ద నాయకులు ఎవరూ మరణించినట్లుగా మాకు సమాచారం రాలేదు అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

మరోవైపు ఇరాన్ అధికారిక పత్రిక యనిస్ సఫక్ సైతం అల్ బగ్దాదీ మరణించినట్లుగా ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఓ దాడిలో బగ్దాదీ తీవ్రంగా గాయపడినట్లు ఇరాక్ టివి ఛానెల్ అల్ సుమేరియా తెలిపింది.జ ఒకవేళ బగ్దాదీ మరణం నిజమే అయితే అది ఐఎస్ సంస్ధకు పెద్ద ఎదురుదెబ్బగానే పరిగణించాలి. అమెరికాతో పలు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఐఎస్ చర్యలపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. వారిపై అన్ని వైపుల నుంచి దాడులను ముమ్మరం చేస్తోంది.

ఆదివారం జరిగిన వైమానిక దాడిలో బగ్దాదీ మరణించడం వాస్తవమైతే అమెరికాతో పాటు ఐఎస్ బాధిత దేశాలకు పెద్ద ఊరట కలిగినట్లే. బగ్దాదీని చంపిన వారికి కాని, పట్టి ఇచ్చిన వారికి కాని భారీ బహుమతిని ప్రకటించారు. ఇంతకీ బగ్దాదీ తల వెల ఎంతో తెలుసా.. అక్షరాలా… 168 కోట్ల రూపాయలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -