Friday, May 10, 2024
- Advertisement -

బాబు అరెస్టైతే ఛాన్స్ బాలయ్యకు కాదు, ఆ ఎంపీనే ఏపీ సీఎం!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గనుక ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయితే.. ఏపీకి కాబోయే సీఎం ఎవరు? అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. బాబు కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయడం ఖాయం అయ్యింది.

ఈ కేసు విచారణలో భాగంగా బాబును అదుపులోకి కూడా తీసుకోవచ్చని వార్తలొస్తున్నాయి. మరి అదే జరిగితే..  ఏపీకి కొత్త సీఎం కావాల్సి ఉంటుంది.

బాబును ఏసీబీ అదుపులోకి తీసుకొంటే ఆయన బాధ్యతలు మరొకరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ బాధ్యతలు ఎవరికి అంటే.. కొంతమందేమో బాలయ్య పేరు చెబుతున్నారు. బాలయ్య ఏపీ సీఎం బాధ్యతలు తీసుకొంటాడని అంటున్నారు. అయితే తను అరెస్టయ్యే పరిస్థితి వస్తే బాధ్యతలను బాలయ్యకు అప్పజెప్పడం పట్ల  పెద్దగా ఆసక్తితో లేడట బాబు. ఆ పరిస్థితి వస్తే బాబు ఛాయిస్ అశోక్ గజపతి రాజు అని టాక్.

బాలయ్యకు ప్రభుత్వాన్ని నడిపేంత శక్తి లేదని.. భావిస్తున్న బాబు ఆ అవకాశాన్ని ఎంపీ చేతిలో పెట్టనున్నాడట. ఈ విధంగా అశోక్ గజపతికి అవకాశం వరించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏసీబీ తనను అరెస్టు చేసేంత వరకూ రాకపోవచ్చనేది బాబు కాన్ఫిడెన్స్ . అలాగక వస్తే మాత్రం ఏపీకి కాబోయే సీఎం అశోక్ గజపతే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -