Tuesday, June 18, 2024
- Advertisement -

బాబుకి జగన్ సవాల్.. నిరూపించకపోతే రాజీనామా చేస్తారా..?

- Advertisement -
Jagan Demand To Resign Babu

ఏపీలో అధికార పార్టీ నేత‌లు ఏం చేసిన సైలెంట్ గా సెటిల్మెంట్ చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు పై జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కోసం మేము పోరడితే తప్పు.. మీరు అధికారుల‌పై చేయిచేసుకుంటే అది మాత్రం త‌ప్పుకాదా.. ఆర్జీఏ కమిషనర్ పై జరిగిన దాడి గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని జగన్ నిలదీశారు.

చట్టం తన పని తాను చేయకుండా ఇలా చంద్ర‌బాబు అడ్డుకోవడం భావ్యం కాదని జగన్ అన్నారు. ఏపీలో ఎక్కడ ఏం జరిగిన అది జ‌గ‌నే చేశాడ‌ని అన‌డం టీడీపీ నేత‌ల‌కు అల‌వాటై పోయింద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. అస‌లు ఆరెంజ్ ట్రావెల్స్‌తో త‌న‌కు సంబంధం ఉందని ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నార‌ని, ఉంటే నిరూపించాల‌ని స‌వాలు విసిరారు. లేకపోతే ముఖ్య‌మంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ట్రావెల్స్ బస్సుల విషయంలో ప్ర‌భుత్వం తీరు అసలు బాలేదని జగన్ అన్నారు.

అధికార పార్టీ ఉన్న నేతలు ఏ తప్పు చేసినా చర్యలు ఎందుకు తీసుకోరు..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికార పార్టీ నేతలు ఏ తప్పు చేసిన ఒక్క కేసు ఉండదు, అదే ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు తప్పు చేయకపోయిన కేసులు అరెస్టులు వుంటున్నాయ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డాడు. మ‌రోవైపు ఆర్టీఏ అధికారుల‌తో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి.. అధికార‌ప‌క్ష‌నేత‌లు క్షమాపణ చెప్పేస్తే.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని జగన్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో రోజుకో ప్రజెంటేషన్ పేరుతో స‌మయాన్ని వృథా చేస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని దొంగ లెక్కలే అని అన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు తనకు సమయం ఇవ్వడం లేదని జగన్ అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -