Wednesday, May 1, 2024
- Advertisement -

కాంగ్రెస్ నేతపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన జీవితా రాజ‌శేఖ‌ర్

- Advertisement -

జీవితా రాజ‌శేఖ‌ర్ అన్న‌పై పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సోద‌రుడు కౌశిక్ దాడి చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. కౌశిక్ రెడ్డి తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ జీవిత రాజశేఖర్ బంజారాహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తనపై కౌశిక్ దాడి చేశాడని గుణశేఖర్ తెలిపారు. దాడికి పార్కింగ్ వివాద‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

గుణశేఖర్‌ రోడ్ నంబర్ 45లో గుణాస్ డైమండ్స్ అనే షోరూంను నిర్వహిస్తున్నారు. డైమండ్స్ షోరూమ్ ముందు కౌశిక్ రెడ్డి కారు పార్క్ చేశారని.. అనుమతి లేకుండా పార్కింగ్ చేయడంపై ప్రశ్నించినందుకు.. అతనే దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దాడి దృశ్యాలు సీసీటీవిలో రికార్డయ్యాయని.. పోలీసులకు ఆ ఫుటేజీని సమర్పిస్తామని తెలిపారు. ఈ ఘటనలో గుణశేఖర్ బాగా గాయపడినట్లు జీవిత తెలిపారు.

కార పార్కింగ్ చేసేముందు ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని సూచించాన‌న్నారు. నేను తెలంగాణా వాడిని …ఎవడితో చెబుతావో చెప్పుకో అని దూషించారు. అసభ్యంగా మాట్లాడటంతోపాటు గుణను కాలితో తన్నారు. లోపలికి వెళ్లి రచ్చ రచ్చ చేశారని తెలిపారు. కౌశిక్ నన్ను కొట్టారు, చాలా దురుసుగా ప్రవర్తించారు. గొంతు పట్టుకోవడంతో ఆదివారం మాట్లాడలేకపోయాను. లేవలేకపోయాను. ఈ ఘటనతో చాలా అప్‌సెట్ అయ్యాను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -