- Advertisement -

చంద్రబాబు పథకం కెసిఆర్ కాపీ కొడతారా ?

- Advertisement -

9 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పెట్టలేని అన్ని వినూత్న పధకాలు అమలు చేస్తున్నారు కెసిఆర్. అయితే ఇప్పుడు ఆయనకంటే వినూత్నంగా ఏపీ సర్కారు కూడా ఒక కొత్త పథకం తో తెరమీదకి ఒచ్చింది. ” మీ ఇంటికే మీ రేషన్ ” అంటూ ఈ కొత్త పథకం రాబోతోంది. రేషన్ దుకాణాల వరకూ రాలేని పరిస్థితి లో ఉన్నవారి కోసం ఈ పథకం మొదలు పెట్టాం అని పరిటాల సునీత ప్రకటించారు.

ఏప్రిల్ 7 నుంచి మీ ఇంటికే మీ రేషన్ పథకం అమల్లోకి వస్తుందని ఆమె ప్రకటించారు. ఈ పథకం సరిగా అమలు చేస్తే.. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో అసరా లేని వారికి ఎంతో ప్రయోజనకరంగా  ఉంటుందనటంలో సందేహం లేదు.

అంతేకాదు.. వచ్చే నెల నుంచి ఒకటో తారీఖు నుంచి  ప్రతి రేషన్ షాపులో బియ్యం.. చక్కెర.. గోధుమపిండి.. కిరోసిన తప్పనిసరిగా పంపిణీ చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ పౌరసరఫరాల శాఖలో చేస్తున్న మార్పులు తెలంగాణలోని కేసీఆర్ సర్కారు అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -