Saturday, May 4, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జో బైడేన్.. డోన్ వర్రీ అంటున్నారు!

- Advertisement -

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలడం లేదు.  ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల  71లక్షల 69వేల 359కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 16లక్షల 99 వేల 560కి పెరిగింది. ఇదిలా ఉంటే బ్రిటన్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవ్వడంలో లాక్ డౌన్ విధించారు. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా,  కరోనా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. 

ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వల్ల భయపడడానికి ఏమీ లేదన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిపుణుల సూచనలు పాటించాలని అన్నారు. కాగా, గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు కూడా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. అమెరికాలో ఇటీవలే ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -