Monday, May 6, 2024
- Advertisement -

మళ్లీ షాక్ ఇస్తున్న బంగారం!

- Advertisement -

లాక్‌డౌన్ సమయం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా ఆరోరోజు పెరిగాయి. ఒక్కో సమయంలో ధరలు దగ్గు ముఖం పడుతున్నా.. తిరిగి ఒకేసారి ధరలు పుంజుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్ లో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.320 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,380 అయింది. వెండి ధర రూ.74 వేల మార్క్‌కు దగ్గరలో ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.310 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,720కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.280 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -