Sunday, May 4, 2025
- Advertisement -

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం

- Advertisement -

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కన్యాకుమారి నుంచి బెంగుళూరు వెళ్తున్న కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ తమిళనాడులోని పచ్చూరు వద్ద పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు బోల్తా పడటంతో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పచ్చూరు, వేలూరు హాస్పిటళ్లకు తరలించారు.

విషయం తెలిసిన వెంటనే చెన్నై, బెంగుళూరు, కన్యాకుమారిల్లో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో చెన్నై, బెంగుళూరుల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ వేకువ జామున రైలు పచ్చూరు దాటుతూ ఉండగా… ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే అధికారులు జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -