కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు, మంత్రి డీకె శివకుమార్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మణీల్యాండరింగ్కేసు నమోదు చేయడం సంచలనంగా మారడంతో రాజకీయాల్లో అలజడి మొదలైంది . హవాలా ఆరోపణలతో పాటు, పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో శివకుమార్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది.
కేసు నమోదైన వారిలో ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య కూడా ఉన్నారు. బెంగళూరు, డిల్లీ కేంద్రంగా హవాలా మార్గంలో భారీ మొత్తంలో నగదును శివకుమార్ తరలించేవాడని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అతడికి మరో నలుగురు సహకరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన చార్జీషీటును ఆధారంగా చేసుకుని ఈడీ ఈ కేసులు నమోదు చేసింది.
వకుమార్తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్.రాజేంద్రలపై కేసు నమోదైనట్టు చెప్పారు. సచిన్ నారాయణ్.. శివకుమార్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు.ఢిల్లీ కర్ణాటక భవన్లో ఉంటూ హనుమంతయ్య శివకుమార్ హవాలా ఆర్థిక లావాదేవీలకు సహకరించినట్టు ఆరోపణలున్నాయి.
గత అగస్టులో ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో శివకుమార్‌కు చెందిన రూ.20కోట్ల లెక్కా పత్రం లేని డబ్బు పట్టుబడింది. అయితే శివకుమార్ మాత్రం ఐటీ శాఖ తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు.