కర్నాటక ఎన్నికల్లో ఏపార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాకపోవడంతో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు చేసే బాల్ గవర్నర్ బంగ్లా కోర్టుకు చేరింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భాజాపా సీఎం అభ్యర్తి యడ్యూరప్ప గవర్నర్‌ను కలిశారు.
జేడీఎస్ నేత రేవణ్ణ (దేవేగౌడ పెద్ద కుమారుడు) 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం తమకు ఉందని చెప్పారు. బలనిరూపణకు వారం రోజుల గడువు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్ కూడా గవర్నర్ ను కలిశారు.
మరో వైపు భాజాపాకు అధికారం దక్కకూడదని జేడీఎస్‌కు మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం పూనుకుంది. మరో వపైపు భాజాపా అధిష్టానంకూడా రంగంలోకి దిగింది.కేంద్ర మంత్రులు ఇప్పటికే బెంగులూరులో మకాం వేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి గవర్నర్ వాజూభాయ్ ఏడు రోజుల గడువు ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి అవకాశం ఇచ్చి బలనిరూపణకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. జెడిఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
నేటి నుంచి వారం రోజులలోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి’’ అని గవర్నర్ చెప్పినట్లు యడ్యూరప్ప మీడియాకు వెల్లడించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటామని ఆయన ఆన్నారు.
రంగంలోకి దిగిన భాజాపా అధిష్టానం జీడీఎస్‌ను చీల్చేందుకు పావులు కదుపుతున్నారు. రేవణ్ణకు 12 మంది శాసనసభ్యులున్నారు. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలోపు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసకుంటాయో చూడాలి.