Friday, April 26, 2024
- Advertisement -

తనను రహస్యంగా వివాహం చేసుకున్నారంటు మ‌హిళ హ‌ల్ చ‌ల్‌

- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ అంటే త‌న‌కు ప్రాణం అని ఓ మ‌హిళ ఎమ్మెల్యే ఇంటి ద‌గ్గ‌ర హ‌ల్ చ‌ల్ చేసింది. వివరాల్లోకి వెళితే… ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ ఇంటికి 45 సంవత్సరాలున్న ఓ మహిళ వచ్చి తన పేరు ప్రేమకుమారి అని ఎమ్మెల్యే రామదాస్ తన భర్త అని.. అతన్ని కలవాలని ఎమ్మెల్యే ఇంటిలోని వ్యక్తిగత సిబ్బందిని కోరింది. సిబ్బంది ఎమ్మెల్యే ఇంట్లో లేరని అధికారిక కార్యక్రమం కోసం బయటకు వెళ్లారని సిబ్బంది చెప్పడంతో.. ప్రేమకుమారి ఒక్కసారిగా ఆందోళనకు దిగింది.బతికున్నంత వరకు రామదాస్‌ను వదలను.. నేను ఎమ్మెల్యేను ప్రేమిస్తున్నాను.

అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు అంటు ఆందోళనకు దిగింది. ఈ విషయం మీడియాకు చేరడంతో అక్క‌డ పెద్ద‌ హైడ్రామా జ‌రిగింది. డబ్బు గుంజడానికి ఆమె బ్లాక్‌మెయిల్ చేస్తోందని కొందరు నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే తనను రహస్యంగా వివాహం చేసుకున్నారని.. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య నడిచిన సంభాషణల ఆడియో, వీడియో క్లిప్పింగులు, ఫోటోలను మీడియాకు అందజేసింది.మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికి వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -