Saturday, April 27, 2024
- Advertisement -

అజ్ఞాతవాసి చాలా నిరుత్సాహపరిచింది క‌త్తి మ‌హేష్‌…

- Advertisement -

ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన అజ్ణాత వాసి సినిమా పవ‌న్ అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అన్ని రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయిని పెట్టుకున్న అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఈ సిన‌మా ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా చాలా ముఖ్య‌మైన‌ది. కాని మిశ్ర‌మ టాక్ రావ‌డంతో జ‌న‌సేనాని పోలిటిక‌ల్ కెరియ‌ర్‌కు చాలా ఇబ్బందే. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్‌కు క‌త్తిమ‌హేష్ క‌త్తిలాంటి స‌ల‌హా ఇచ్చారు.

ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి పవన్ వెళ్లబోయే ముందు ఓ మంచి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నానని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమాను వీక్షించిన అనంతరం క‌త్తి స్పందించారు.

అజ్ఞాతవాసి’ గురించి తాను విశ్లేషణ చేస్తున్న వీడియోను కత్తి మహేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ సినిమా చాలా నిరుత్సాహ పరిచింది. నిజానికి ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఇంప్రెస్ కాని వాడిని, ట్రైలర్ చూశాక ఏదో ఉంటుందని భావించా. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అనిరుథ్ మ్యూజిక్ బాగున్నాయి. సరదాగా పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ పాట తప్పా, మిగిలిన అన్ని పాటలు నాకు నచ్చాయి. ఆ పాటల్లో చాలా బలమైన అర్థాలు కనిపించాయి. స్క్రీన్ పై ఈ సినిమాను తెరపై ఎలా చూపించారనే పెద్ద ఆసక్తి తో ఈ సినిమాకు వెళ్లా. అన్ని విషయాలను పక్కనపెట్టి ఈ సినిమాను సినిమాగా చూద్దామని వెళ్లాను. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ ఇద్దరూ నిరుత్సాహపరిచింద‌న్నారు.

సీరియస్ కథకు కామెడీ ట్రీట్ మెంచ్ ఇవ్వడంతో ఈ సినిమా అపహాస్యం పాలైపోయింది. నాలుగుకామెడీ సీన్లు, చౌకబారు రొమాంటిక్ సీక్వెన్స్ కలిపి తెలుగు ప్రేక్షకులకు ఇది సరిపోతుందిలే అన్నట్టు ట్రీట్ మెంట్ ఇచ్చారు. మంచి సినిమా చేసి పుల్‌టైమ్ రాజ‌కీయంలోకి దిగాల‌ని స‌ల‌హా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -