రేప్. ఒక అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతగా ఆమెను మానభంగం చేయడం.ఇది ఒక్క మనదేశంలోనే కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే.అయితే కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇది హద్దుదాటిపోతోంది.
కెన్యాలో అయితే ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరు రేప్ కు గురైనవారే.అక్కడ కామాంధులు కదం తొక్కేసారు.అమ్మాయిని బయటకు పంపాలంటే భయమేస్తోంది.నిత్యం ఏదో ఒక మూల అమ్మాయిల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.రేప్ తో వదిలి పెట్టకుండా… శారీరకంగా హింసించడం.. కూడా చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ విష సంసృతిపై కెన్యాలో ఓ విప్లవం ఉవ్వెత్తున లేచింది. దేశంలో రేప్ లు జరగకుండా అక్కడ ఓ ఉద్యమం లేచింది. ఉద్యమం అన్నాం కదా అని ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టి చేస్తున్నది కాదు. కేవలం రేప్ లకు వ్యతిరేకంగా చేస్తున్నది.
నో మీన్స్ నో కెన్యా.. నో వరల్డ్ అంటూ కొత్త నినాదాన్ని వారు లేవ నెత్తారు.దీనిలో భాగంగా రేప్ లు, అత్యాచారాల మీద అక్కడి విద్యార్థులు, యువకులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. రేప్ కు గురి కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి,వారిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలతో పాటు….రేప్ కు గురైన వారిని ఎలా రిసీవ్ సుకోవాలి, వారిని ఏవిధంగా ట్రీట్ చెయ్యాలి.. ఆర్థికంగా, మానసికంగా వారిని ఏవిధంగా తయారుచేసి సొసైటీలో నిలబెట్టాలి అనే కోణంలో అవగాహన కల్పిస్తూ ఎంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.
నిజానికి కెన్యా అనేది ఒక చిన్న దేశం. పిలుచుకోవడానికి పేద దేశమే అయినా…. ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో ధనిక దేశాలు,అభివృద్ధి చెందిన దేశాలు చేయలేని పనిని వారు చేస్తున్నందుకు నిజంగా మనం వారిని మెచ్చుకోవాలి.వారిని చూసైనా అన్ని దేశాల్లో ఇలాంటి విప్లవం వస్తే అంతకంటే మన ఇంటి ఆడపడుచులకు కావల్సింది ఏముంది చెప్పండి.
Watch Video: {youtube}IrZS8Aekqfw{/youtube}
