Sunday, May 12, 2024
- Advertisement -

పాతిక కోట్లు అనుకుంటే నలభై కోట్లు దాటేసింది

- Advertisement -

ఇవాళ మొదలు పెట్టిన సినిమా పూర్తి అయ్యే సరికి బడ్జెట్ విషయం లో కోట్లకి కోట్లు దాటడం సర్వసాధారణ విషయం అయిపొయింది,

ఒక పాతిక కోట్లకి అనుకున్న సినిమా ముప్పై కి చేరడం, ముప్పై అనుకున్నది ముప్పై ఐదు కి వెళ్ళడం ఇలా డైరెక్టర్ ల భారీ తారాగణం కావచ్చు, హీరోయిన్ ల లెక్కలు కావచ్చూ అన్నీ కలుపుకుని సినిమా మీద తీవ్ర ప్రభావం చూపించి ప్రొడ్యూసర్ ని నిలువునా ముంచేస్తున్నాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి , సినిమా ఏదైనా తేడా వస్తే ఏంటి పరిస్థితి అని చూడడం కోసం కిక్ 2 ని ఉదాహరణ గా చెప్పుకోవాలి. దారుణమైన లాసు తో తాను మాత్రమె కాకుండా తన తమ్ముడు ఎన్టీఆర్ ని కూడా బాగానే ముంచాడు కళ్యాణ్ రాం. ఇ సుర్రేందర్ రెడ్డి తప్పిదాల  వల్లనే భారీగా ఆ సినిమా బడ్జెట్ పెరిగింది అంటున్నారు ఐప్పుడు అదే తప్పు వినాయక్ కూడా చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.మనోడు పైకి లేపే సుమోల రేంజ్ లో… బడ్జెట్ గ్రాఫ్ పెరుగుతుంది. మామూలుగానే భారీ సినిమాల డైరెక్టర్. 

మరి ఇప్పుడు అఖిల్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ ని లాంఛ్ చేయడం ఆ మూవీకి నితిన్ లాంటి కండిషన్స్ పెట్టుకోని నిర్మాత దొరకడంతో ఇక విచ్చల విడిగా బడ్జెట్ పెట్టేసాడు అని అంటున్నారు, ఇప్పటికే పాతిక కోట్లు అనుకున్న బడ్జెట్ నలభై కోట్లు దాటడం తో నాగార్జున కూడా అంత ఆసక్తి గా కనపడ్డం లేదు. ఖర్చు ఎక్కువైన విషయం నితిన్ ఒప్పుకుంటున్నాడు కూడా. అయితే.. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు అనేక దేశాల్లో షూటింగ్ చేశామని అయినా లెక్కలు చూసుకోవడం లేదని చెప్పకొచ్చాడు కుర్రాడు. బడ్జెట్ ఎంత రిటర్న్ ఎంత అనేవి చూసుకుంటున్న ఈ రోజుల్లో మొదటి సినిమా తోనే అఖిల్ కి కమర్షియల్ లాస్ ఇవ్వడం నాగార్జున కి అస్సలు ఇష్టం లేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -