కొట్టేయడానికి కాదేది అనర్హం అనే సామెత ఎప్పుడూ మనకు ఏదో ఒక చోరితో నిజమవుతూనే ఉంది. టెక్నాలజీ ఎంత పెరిగినా… దానికి మించిన స్పాంటేనియస్ టెక్నాలజీ వస్తూ ఉండడంతో దొంగలు.. వాహనాల యజమానులను చిత్తు చేస్తూనే ఉన్నారు. సిసి కెమేరాలు ఈవిషయాలను చూపిస్తే తప్ప మనం దేన్ని నమ్మే స్థితిలో లేం కాబట్టి… తాజాగా జరిగిన ఓ హైటెక్ కారు దొంగతనం స్టోరీ యూరోపియన్ దేశాల్లో వైరల్ అవుతుంది.
ఇక్కడ వీడియోలో మనకు కనిపిస్తుంది ఇద్దరు దొంగలు. వారు క్రైమ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దానికి తగ్గ ఎక్విప్ మెంట్లను తమతో తెచ్చుకుని డిజిటల్ లాక్ లు తమ దగ్గర లేకపోయినా… కారు తస్కరించడానికి స్కెచ్ లు వేస్తున్నారు. దీనిలో భాగంగా వారు తమతో తెచ్చుకున్న యునీక్ డివైజ్ లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ తో కారు దగ్గరకు ఓ దొంగ వెళతాడు. ఇంకో కాంపోనెంట్ తో యజమాని ఇంటి దగ్గరికి ఇంకో దొంగ వెళతాడు. కారు దగ్గరున్న వాడి కాంపోనెంట్ కు తాళం తాలూకు సిగ్నల్ వెళుతుంది. దీనిని ఆ కాంపోనెంట్ క్యాప్చర్ చేసి రెండోవాడి దగ్గరికి చేర్చుతుంది. జస్ట్ 60 సెకన్ల వ్యవధిలో ఈ తంతు ముగిసిపోతుంది. ఈ క్రైమ్ కు రిలే క్రైమ్ అంటూ పోలీసులు పేరు పెట్టారు.ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్ ల్యాండ్ ఏరియాలో జరిగిన ఈ చోరి సీసీ కెమరాలో రికార్డ్ అయింది.
https://www.youtube.com/watch?v=HZIfEWVBXw4