- Advertisement -
ప్రపంచంలో ఏ దేశాన్నైనా తాము ఏమి చేయమని, కాని తమ జోలికి వస్తే వస్తే మాత్రం సర్వనాశనం చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఇటీవల తాము ఉత్పత్తి చేస్తున్న అణ్వాయుధాలపై ప్రతిచోట చర్చ జరుగుతోందని, వాటి వల్ల ప్రపంచదేశాలకు వచ్చే నష్టమేమి లేదని ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ స్పష్టం చేశారు.
పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపైకి ఊరికే దండెత్తి వస్తే మాత్రం మా ప్రతాపం చూపుతామని కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించారు. అణ్వాయుధ రహిత ప్రపంచంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.