కాలుదువ్వుతోన్న కిమ్.. ఇక యుద్దమేనా ?

- Advertisement -

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అతడు తీసుకునే నిర్ణయాలు, విధానాలు అన్నీ కూడా ఇతర దేశాలకు భయం కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా కిమ్ అమెరికాపై ఎప్పుడు కూడా తనదైన రీతిలో విరుచుకు పడుతూ ఉంటాడు. దాంతో అమెరికా ఉత్తరకొరియా మద్య వివాదాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగిన సమయంలో ఉత్తర కొరియా- అమెరికా మద్య యుద్ద వాతావరణం తీవ్ర స్థాయిలో కమ్ముకోవడం మనం చేశాం. అణుబాంబులు వేసేందుకు కూడా వెనుకాడబోమని ఇరు దేశాలు కూడా గట్టిగానే సవాల్ చేసుకున్నాయి.

ఇక ప్రస్తుతం అమెరికా అద్యక్షుడుగా జో బైడెన్ ఎన్నికైన తరువాత ఉత్తర కొరియా అమెరికా మద్య వివాదాలు కొంత సద్దుమణిగినట్లే కనిపించాయి. అయితే తాజాగా కిమ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మరోసారి ఇరు దేశాల మద్య అగ్గు రాజుకునేలా కనిపిస్తోంది. ఇటీవల జులై 27 న ఉత్తరకొరియా యుద్ద విరమణ దినోత్సవ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఉత్తరకొరియను అమెరికా శత్రువుల చూస్తోందని, దక్షిణ కొరియాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యలకు పాల్పడుతోందని విమర్శలు చేశాడు. అన్వస్త్రాల విషయంలో అమెరికా తరచూ బెదిరింపులకు పాల్పడుతోందని, ఇలాంటి సమయంలో తాము ఆత్మరక్షణకై ఎలాంటి చర్యకైనా పాల్పడతమంటూ హెచ్చరించారు.

అంతే కాకుండా అమెరికా నుంచి ఎలాంటి చర్య ఎదురైన దాన్ని ప్రతిఘటించడానికి తమ దేశం అన్నీ విధాలుగా సిద్దంగా ఉందని, సైనిక సామర్థ్యాల పరంగా నైనా, లేదా అణ్వాయుధాలు ప్రయోగించడానికైనా తమ దేశం సిద్దంగా ఉందని తెలిపాడు. అమెరికా మాపై ఎలాంటి చర్య చేపట్టిన తాము అణుబాంబు వేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామని హెచ్చరిచాడు. ప్రస్తుతం కిమ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. మరి కిమ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Also Read

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

మళ్ళీ తెరపైకి పిఒకే.. ఈ సారి యుద్దం వస్తే !

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -