కిరణ్ కుమార్ రెడ్డి కి బిజెపిలో పదవి?

కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరుతున్నారంటూ ఈ మద్య ప్రచారం బాగానే జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించనూ లేదు. జై సమైక్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి కనుమరుగైన కిరణ్‌కుమార్ రెడ్డి గురించి తాజాగా మరో వార్త ప్రచారం జరుగుతోంది.

 కిరణ్ కు భారతీయ జనతా పార్టీ తగిన గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధమైందట, అందులో భాగంగా కిరణ్ ను పార్టీలో చేర్చుకొని ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడమే కాకుండా కేంద్రమంత్రి పదవిని కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి భవిష్యత్తులో సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడాలన్న యోచనలో ఉన్న బిజెపి బలం పెంచుకోవడం కోసం ఒక్కో అడుగు వేస్తున్నదన్నమాట!