- Advertisement -

మరిన్ని రాష్ట్రాలను విడగొడతానంటున్న కోదండరాం!

- Advertisement -

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విభజనలో పోరాటయోధుడిగా తెచ్చుకొన్న పేరు కోదండరాంకు సరిపోనట్టుగా ఉంది. తెలంగాణ రాజకీయ జేఏసీ అదినేతగా ఉన్న పేరు సరిపోదన్నట్టుగా ఇప్పుడు

దేశంలోని అన్ని వేర్పాటు వాద ఉద్యమాలకూ తమ మద్దతు ఉంటుందని కోదండరాం చెబుతున్నారు. మరి ఈయన గారికి వేరే పని కూడా లేదో ఏమో కానీ.. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లన్నింటికీ తమ మద్దతు ఉంటుందని.. అన్ని ఉద్యమాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధమని ఆయన ప్రకటించాడు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి కోదండరాం హడావుడి పెద్దగా లేదు. రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంలో  కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాకా.. కోదండను పట్టించకొనే వారు లేకుండా పోయారు. అయినా అడపాదడపా మీటింగులు..పెడుతూ కోదండ వార్తల్లోకి వస్తున్నాడు. అయితే ఈయన తెలంగాణ ప్రగతి.. తెలంగాణ వచ్చాకా సాధించిన అభివృద్ధిల గురించిమాత్రం ఎలాంటి కామెంట్లూ చేయడం లేదు. కానీ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రత్యేక ఉద్యమాలకూ తమ మద్దతు ఉంటుందని మాత్రం ప్రకటించాడు.

మరి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ వాళ్లు సాధించింది ఏమిటి? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం వల్ల ఇక్కడి ప్రజల బతుకుల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనే అంశాల గురించి ఆలోచించకుండా.. ఈ అంశాల గురించి మాట్లాడకుండా.. దేశంలోని ఇతర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకూ తాను మద్దతును ప్రకటిస్తున్నానని..  దేశాన్ని మరిన్ని చిన్న రాష్ట్రాలుగా విడగొట్టడానికి తెలంగాణ వాదుల తరపున తను పోరాడతానని కోదండరాం ప్రకటించడం ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -