కొన్ని గంటల్లో రిలీజ్‌కు సిద్దమైన అజ్ణాత వాసి సినిమాలోని ఓ పాట వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని ‘కొడకా కోటేశ్వర్‌రావు..’ అంటూ సాగే పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోటేశ్వర్‌రావు అనే లాయర్ విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట కోటేశ్వర్ రావు అనే పేరు గల వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆ పాటలో నుంచి ‘కోటేశ్వర్ రావు’ పదాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పరమశివుడి పేరును అవహేళన చేసేలా అది ఉంది. ఈ పాటతో పవన్.. మా మనోభావాలను దెబ్బతీశారు. ఇది పబ్లిసిటీ కోసం ఎంతమాత్రం కాదు. మానసిక క్షోభకు గురవడం వల్లే ఫిర్యాదు చేశా’ అని లాయర్ కోటేశ్వర్ రావు అన్నారు.
కొడకా చిరంజీవి, కొడకా త్రివిక్రమ్. అని ఎందుకు పెట్టుకోలేకపోయారని లాయర్ ప్రశ్నించారు. పాటలో నుంచి కోటేశ్వర్ రావు పదాన్ని తొలగించకుంటే సినిమాను అడ్డకుంటామని ఆయన హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వర రావులందరూ ఏకం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
https://www.youtube.com/watch?v=bt5_5eHr1HM