మరో వివాదంలో అల్లు అర్జున్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్.. మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే అతడు చేసిన ర్యాపిడో యాడ్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు సేవలను తక్కువ చేసేలా చూపించినందుకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ నోటీసుల పంపిన విషయం తెలిసిందే. యాడ్‌లో కించపరిచే విధంగా ఉన్న అంశాలను తొలగించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దాంతో ర్యాపిడో సంస్థ తో పాటు అల్లు అర్జున్ కూడా దానిపై వివరణ ఇచ్చాడు. తాజాగా అల్లు అర్జున్ శ్రీచైతన్య విద్యాసంస్థల యాడ్‌లో నటించాడు. కొత్త ఉపేందర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు.

ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో శ్రీచైతన్య ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీచైతన్యతో పాటు అల్లు అర్జున్‌పై కేసు పెట్టారు. దీంతో అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కున్నట్లు అయింది.

Also Read

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

లెక్చరర్ గా పవన్ కల్యాణ్

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

Most Populer

Recent Posts