Monday, April 29, 2024
- Advertisement -

మేల్కొండి.. 47 ఏళ్లు వెన‌కున్నారు

- Advertisement -
  • నెటిజ‌న్ల‌పై కుష్భూ విమ‌ర్శ‌

అల‌నాటి హీరోయిన్‌.. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న కుష్భూకు కోప‌మొచ్చింది. త‌న మ‌తంపై ట్విట్ట‌ర్ల్‌లో చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మండిప‌డ్డారు. వారికి ఘాటుగా బ‌దులిచ్చారు.

‘కొంతమంది నన్ను కొత్తగా కనుగొన్నారు. నా పేరు నఖాత్‌ ఖాన్‌.. యురేకా!! మూర్ఖులారా.. ఆ పేరు నా తల్లిదండ్రులు పెట్టింది. అవును నా పేరు ఖాన్‌.. ఇప్పుడేంటి? చాలా ఆలస్యమైంది, ఇక మేలుకోండి. మీరు 47 సంవత్సరాల వెనుక ఉన్నారు’ అంటూ ఆమె నెటిజ‌న్ల‌కు బదులిచ్చారు. ఆమె మ‌తం గురించి ప్ర‌శ్నించ‌డం.. నిందించ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు.

ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. ఇటీవ‌ల ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొని త‌న పాత్ర ప‌రిధి పూర్తి చేసుకున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వ‌స్తున్న ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుద‌ల అవుతోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -