Friday, May 3, 2024
- Advertisement -

న‌వ్వులు పూయిస్తానంటున్న ఆచారి

- Advertisement -
  • 26న ఆచారి అమెరికా యాత్ర‌
  • విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన చిత్ర బృందం

మంచు కుటుంబానికి 2017 సంవ‌త్స‌రం క‌ల‌సి రాలేదు. మంచువిష్ణు ‘లక్కున్నోడు’, మంచు లక్ష్మి ‘లక్ష్మీబాంబు’, మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ తదిత‌ర సినిమాలు అట్ట‌ర్‌ఫ్లాపులుగా మిగిలాయి. వీటి ప్ర‌భావంతో దిగాలుగా ఉన్న మంచు కుటుంబం ఈసారి బ్ర‌హ్మానందంతో క‌లిసి హాస్యం పంచేందుకు వ‌స్తున్నారు. ఎలాగైనా విజ‌యం పొందాల‌నుకుంటూ ఆచారి అమెరికా యాత్రగా జ‌న‌వ‌రి 26వ తేదీన రానున్నాడు.

‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాల‌తో విష్ణుకు విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వరరెడ్డితో మ‌రోసారి విష్ణు రానున్నాడు. సినిమా అవ‌కాశాలు స‌క్ర‌మంగా లేని బ్ర‌హ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలో న‌టిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కీర్తి చౌదరి, కిట్టు నిర్మాతలు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. సంపూర్ణ వినోదాత్మకగా నేప‌థ్యంలో సినిమా రానుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ, పృథ్వీ, ప్రవీణ్‌, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు నటిస్తున్నారు.అయితే ఈ స‌మ‌యంలో మ‌రిన్ని సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా అనుష్క న‌టిస్తున్న భాగ‌మ‌తి సినిమా కూడా రానుంది.

https://www.youtube.com/watch?v=IQgbdLUarx4

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -