తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ నటి కుష్బుకు ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. నో టిక్కట్… ఓన్లీ ప్రచారం అంటూ అధిష్టానం కుష్బును ఖంగుతినిపించింది. డిఎంకెతో పొత్తు కుదుర్చకున్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 41 స్ధానాల నుంచి పోటీ చేస్తోంది.
తొలి విడతగా 33 మంది అభ్యర్ధులతో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగి ఎనిమిది మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా కుష్బు పేరు లేకపోవడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. నిజానికి ముఖ్యమంత్రి జయలలితపై మైలాపూర్ నుంచి పోటీ చేయాలని కుష్బు ఆశించింది. అయితే ఆమెపై పోటీయే కాదు.. చివరకు ఎక్కడా టిక్కట్ దక్కలేదు.
ఇక్కడి నుంచి పోటీ చేయాలని మరో నటి నగ్మా కూడా ఆశించారు. అయితే ఆమెకు కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కట్ నిరాకరించింది. కుష్బుకు టిక్కట్ రాకుండా చేసింది నగ్మానే అని పార్టీలో కొందరు అంటున్నారు. ఏది ఏమైనా కుష్బు మాత్రం ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది.