ఎన్నికల ఫలితాల వెల్లడికి టైం దగ్గర పడుతున్న కొద్ది ప్రజల్లోనే కాదు నేతల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసి, ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటామని ప్రకటించిన నేతలూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆ నేతల్ల అలజడి మొదలైంది.
ముఖ్యంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరంలో మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. బీజేపీ నేతలను గుండు,అరగుండు అని కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్ సంబోదిస్తే..పాలమూరు పొట్టొడు అని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక ఇంతవరకు బాగానే ఉన్న రిలాక్స్ మోడ్ నుండి యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్న నేతలు ఇప్పుడు కౌంటింగ్‌పై దృష్టి సారించారు.
బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, అరవింద్, బండి సంజయ్,ఈటల,డీకే అరుణ,రఘునందన్ లతో పాటు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, కడియం కావ్య,ముఖ్యంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుండి పోటీ చేసిన పట్నం సునీతా, బీఆర్ఎస్ నుండి బరిలో ఉన్న పద్మారావు గౌడ్,ఆర్ఎస్ ప్రవీణ్ వంటి నాయకులు కౌంటింగ్ ఫలితాలపైనే దృష్టి సారించారు. ఇక మెజార్టీ సీట్లు మావే అంటే మావేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతుండగా సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో వేచిచూడాల్సిందే.
