Wednesday, May 15, 2024
- Advertisement -

ఆయనకు సోనియాగాంధీ ఎందుకు పడిపోయిందంటే….!

- Advertisement -

చాలా ఆసక్తికరమైనది సోనియాగాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమ కథ. ఇటాలియన్ అయిన సోనియా, ఇండియన్ అయిన రాజీవ్ ల మధ్య ప్రేమ పుట్టడం విశేషమే.

ఇంగ్లాండ్ వేదికగా వీరి ప్రేమపుట్టింది. అయినా రాజీవ్ ది ఒక పెద్ద కుటుంబ నేపథ్యం.. సోనియాది మాత్రం ఇటలీలో ఒక సాధారణ కుటుంబ నేపథ్యం. ఇలాంటి వారి మధ్య స్నేహం మొదలై.. ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత జరిగినవి అందరికీ తెలిసిందే. ఒక దశలో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ మహిళ స్థాయికి చేరింది సోనియా. మరి ఆమె ఆ స్థాయికి వెళ్లిందీ రాజీవ్ తో వివాహం జరగడం వల్లనే అని వేరే చెప్పనక్కర్లేదు.

మరి అలాంటి వివాహానికి కారణమైన ప్రేమ ఎలా పుట్టిందనే అంశం గురించి సోనియా ఎప్పుడో తన కు సన్నిహితులతో పంచుకొన్నారట. ఆ విషయాన్ని ఇప్పుడు గ్రంధస్తం చేశారు ఒక వ్యక్తి. దాని ప్రకారం.. సోనియాగాంధీ రాజీవ్ అందాన్ని చూసి పడిపోయింది. కాశ్మీర బ్రహ్మణ పుట్టుతోఉండే రాజీవ్ ను చూసి సోనియా పడిపోయిందట. ఆ విషయాన్ని ఆమెనే ధ్రువీకరించింది. తన సన్నిహితులతో చెప్పుకొంది. ఆయన అందాన్ని చూసి పడిపోయానని.. తనే వెళ్లి పలకరించానని సోనియాగాంధీ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది!

మరి రాజీవ్ కు అందగాడనే పేరుంది. ప్రధాని ఇందిర తనయుడిగానే కాకుండా.. వ్యక్తిగత ఛరిష్మాతో కూడా రాజీవ్ గాంధీకి క్రేజ్ ఉంది. కాబట్టి సోనియాగాంధీ ఆయనకు పడిపోవడం విశేషం ఏమీ కాదేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -