- Advertisement -

షర్మిల తాజా ఓదార్పు యాత్ర అసలు లక్ష్యం అదేనా..?!

- Advertisement -

ఒకవైపు అన్న ఆంధ్రప్రదేశ్ లో బిజీ అయిపోవడంతో.. తెలంగాణపై దృష్టి నిలిపింది వైఎస్సార్ తన షర్మిల. ప్రస్తుతం ఆమె వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రలో బిజీగా ఉన్నారు.

అన్న మొదలు పెట్టిన యాత్రను ఆమె ఇలా కొనసాగిస్తోంది. జగన్ ఆపిన యాత్రను ఆమె కొనసాగిస్తూ పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతోంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఓదార్పు యాత్రపూర్తిగా అయిపోయింది. తెలంగాణలో మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఓదార్పు యాత్రలో ఒక ప్రత్యక లక్ష్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేమొంటే.. వరంగల్ ఉప ఎన్నిక.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో వరంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయం అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడం గురించి వైకాపా తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం తెలంగాణలోవైకాపా ఉనికి పాట్లు పడుతోంది. దీంతో వరంగల్ లో పోటీ చేయడం గురించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతోంది. అయితే ఇప్పుడు షర్మిల ఓదార్పు యాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించబోతోంది. కాబట్టి ఇప్పుడు పోటీ గురించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది వైకాపా. ఇక్కడ అభ్యర్థిని నిలిపేదా వద్దా? అనే అంశం గురించి ఈ ఓదార్పు యాత్రతో వచ్చే జనస్పందనను బట్టి నిర్ణయం తీసుకొంటున్నారట వైకాపా వాళ్లు.

ఎలాగైనా వరంగల్ లో పోటీ చేయాలనే భావనతోనే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఇప్పుడు గనుక ఇక్కడ నుంచి వైకాపా పోటీ చేయకపోతే ఆ పార్టీ తెలంగాణ విభాగం మనుగడ మరింత ప్రశ్నార్థకంలో పడిపోతుంది. కాబట్టి ఉనికిని చాటుకోవాలంటే వైకాపా వాళ్లు పోటీ చేయాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -