పోర్న్ ప్రపంచంలో టాప్ లేపి బాలీవుడ్‌లోకి దూసుకొస్తోంది 22 ఏళ్ల లెబనాన్ సుందరి మియా ఖలీపా. మియా బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుంటే మనం షాక్ అవ్వక తప్పదు.
10ఏళ్ల వయసులోనే అమెరికా వెళ్లిపోయింది. టీనేజీ లో ఉండగానే పోర్న్ ప్రపంచంలో నెం.1 నాయికగా ఎదిగేసింది. ప్రపంచంలోనే నెం.1 పోర్న్ స్టార్ గా రేటింగ్ సంపాదించింది. అయితే ఈ అమ్మడుపై అరబ్ దేశాల్లో జిహాదీలు చాలా సీరియస్‌గా ఉన్నారు.
మియా బురఖా వేసుకుని పోర్న్ సినిమాలో నటించడంతో వీరికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవలే ఈవిడ ట్విట్టర్ ని కూడా హ్యాక్ చేశారు. ఉన్నట్టుండి పోర్న్ ప్రపంచం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగుపెట్టాలనుకోవడానికి కారణం ఏమిటి అని ఆరా తీస్తే అనేక సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రముఖ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ తరహాలోనే ఈవిడ కూడా ఇక్కడ స్టార్ గా ఎదగాలని కలలు గంటోంది. ఇక్కడ సినిమాలతో ఓ ఊపు ఊపేసి అటునుంచి హాలీవుడ్‌కు చెక్కేయాలన్నదే ఆమె ప్లాన్ అట.
