బాహుబలి, బజరంగి భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యాడు స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ రెండు సినిమాలకు కథలు అందించినందుకు ఆయనకు సూపర్ క్రేజ్ ఏర్పండింది.
అయితే ఇక ఆయన తర్వాత ఏ రేంజ్ కథ రాస్తాడో అని అందరు ఎదురు చూస్తుంటే అందరికి షాక్ ఇచ్చేలా ఓ అడల్ట్ బేస్డ్ స్టోరీ రెడీ చేస్తున్నానని ఆయన తన సన్నిహితులకు చెప్పాడట. ఇప్పుడు ఈ విషయం లీక్ అవ్వడంతో పెద్ద సంచలనంగా మారింది.
ఈ సినిమాను ఆయనే స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయన జాహ్నవిని స్క్రీన్ టెస్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా మళయాల సూపర్ స్టార్ తనయుడు ‘ఓకే బంగారం’ హీరో దుల్కర్ సల్మాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట విజయేంద్ర ప్రసాద్.ఈ సినిమాతో సెక్స్ పట్ల ప్రతి ఒక్కరికి ఓ డిఫరెంట్ ఒపీనియన్ కలుగుతుందని చెపుతున్నాడు విజయేంద్రుడు.
గతంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ సినిమాకు మెగా ఫోన్ పట్టిన విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సినిమా కథ ఇది అని బయటకు వచ్చినప్పుడే ఇన్ని సంచలనాలకు దారితీస్తే ఇక సినిమా వచ్చాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
