పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రెండు దాయాద దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రధాని ప్రకటించారు. అటు పాకిస్థాన్ కూడా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామాని సంకేతాలు పంపింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎలాంటి పరిస్థుతులనైనా ఎదుక్కొనేందుకు సిద్దంగా ఉండాలి పాక్ ప్రభుత్వం ఆర్మీకి ఆదేశాలు జారిచేసింది. దీంతో భారత్ కూడా సరిహద్దుల్లో భారీగా అదనపు బలగాల్ని మోహరిస్తోంది.
దీనిలో భాగంగానే కశ్మీర్లో అదనపు సాయుధ బలగాలను మోహరించాలని భారత హోంమంత్రిత్వ శాఖ అక్కడి డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. తక్షణం 100మంది అదనపు సాయుధ భద్రతా బలగాలను కశ్మీర్లో మోహరించాలని లేఖలో డీజీపీకి సూచించింది. ఇందులో సీఆర్పీఎఫ్-45, బీఎస్ఎఫ్-35, ఎస్ఎస్బి-10, ఐటీబీపీ-10 మంది జవాన్లు ఉండనున్నారు.
మరో వైపు రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ సరిహద్దుల్లోని 27 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రత్యేక శిబిరాలకు తరలిరావాలని సైనికాధికారులు నోటీసులు జారీ చేశారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగే అవకాశమున్నందున నిత్యావసర వస్తువులు తీసుకొని గ్రామస్థులు శిబిరాలకు తరలిరావాలని కలాల్ సరిహద్దు గ్రామ సర్పంచ్ రమేష్ చౌదరి చెప్పారు. తమ గ్రామంలో నివాసముంటున్న 830 మంది ప్రజలు తరచూ ఇళ్లను ఖాళీ చేసి శిబిరాలకు వెళ్లాల్సి వస్తోందని కలాల్ గ్రామస్థుడు విజయ్ చౌదరి చెప్పారు.
కశ్మీర్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అత్యవసరంగా సాయుధ బలగాలను మోహరించడం ఉత్కంఠను రేపుతోంది. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిచ్చామని ఇదివరకే ప్రకటించిన కేంద్రం.. ఏదైనా భారీ ఆపరేషన్ చేపట్టే దిశగా సాగుతోందా అన్న వార్తలు వస్తున్నాయి. సాయిధ బలగాల మోహరింపుతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

