Sunday, May 19, 2024
- Advertisement -

నారా లోకేష్ ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి..?

- Advertisement -
Lokesh Assets RS 14 5 cr Became 330 cr in 5 Months

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు. అయితే నారా లోకేష్ ఆస్తి కేవలం ఐదు నెలల కాలంలో రూ.14.5 కోట్ల రూ.330 కోట్లకు పెరిగిందట. ఈ విషయంపై జాతీయ మీడియా ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

గత ఏడాది  అక్టోబరు నెల 19వ తేదీన లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల్లో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌లో‌ని షేర్లు, కొన్ని స్థిరాస్తులు, రూ.95 లక్షల విలువ చేసే ఓ కారును పేర్కొన్నారని తెలిపింది. తమ దగ్గర ఉన్న ఆస్తులను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలనుకున్న నెపథ్యంలో ఈ ఆస్తుల వివరాలను తెలుపుతున్నట్టు నారా లోకేష్ చెప్పారని పేర్కొంది. అయితే.. ఇపుడు ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా అంటే 2017 మార్చి 7వ తేదీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో రూ.‌330 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లోకేష్ పేర్కొన్నారని తెలిపింది.

ఇందులో షేర్ల రూపంలోనే రూ.274 కోట్లు ఉందని చెప్పినట్టు ప్రచురించింది. అయితే తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించినప్పుడు ‘బుక్ వాల్యూ’ని పరిగణనలోకి తీసుకున్న లోకేష్… ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ‘మార్కెట్ వాల్యూ’ని పరిగణనలోకి తీసుకున్నారని చెప్పింది. అంటే కేవలం  ఆరు నెలల్లో కాలంలోనే నారా లోకేష్ ఆస్తులు ఇంత భారీ స్థాయిలో ఎలా పెరిగాయన్న దాని పై విశ్లేషకులు షాక్ అవుతున్నారు. అంటే లోకేష్ దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నాయా అనే సందేహాం అందరిలోనూ కలుగుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -