Monday, May 5, 2025
- Advertisement -

లోకేష్ కొడుకుకు పేరు పెట్టింది ఆయనే..!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ బాబు తనయుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ మనవడు…

ఇంతటి డైనమిక్ నేపథ్యం ఉంది ఈ బుజ్జిబాబుకు.

తాజాగా నారా లోకేష్ బాబు, బ్రహ్మణీలు తమ గారాల పట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు! ట్విటర్ ద్వారా తమ తనయుడిని ప్రపంచానికి పరిచయం చేశారు ఈ దంపతులు.

ఇదే సందర్భంలో తమ బాబు పేరును “దైవాన్ష్” గా కూడా వారు పేర్కొన్నారు. మరి ఈ పేరు పెట్టిందెవరు.. అనే అంశం గురించి కాస్త వాకబు చేస్తే.. నందమూరి నటసింహం పేరు వినిపిస్తోంది. కూతురు తనయుడికి బాలయ్య దగ్గరుండి పేరును వెదికినట్టుగా సమాచారం. ఇలాంటి విషయాల్లో బాలయ్యకు ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే.

వాస్తు.. ఇతర సంప్రదాయాల గురించి బాలయ్యకు మంచి పట్టు ఉంది. ఈ విషయాల్లో బాలయ్య తన సన్నిహితులకు కూడా సలహాలు ఇస్తుంటారు. చొరవ తీసుకొని మార్పులను సూచిస్తూ ఉంటారు. ఇక సొంతమనవడి విషయంలో ఆయన ఇంకెంత చొరవ చూపి ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు. తన పాండిత్యాన్ని అంతా ఉపయోగించుకొని బాలయ్య మనవడి జన్మనక్షత్రం తదితరాలను పరిశీలించి “దైవాంన్ష్” అనే పేరు పెట్టినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -