Sunday, May 5, 2024
- Advertisement -

ప‌దేళ్ల బాలిక‌ను త‌ల్లిని చేసిన 12 ఏళ్ల బాలుడు..

- Advertisement -

క‌లి కాలం అంటే ఇదేనేమో…10 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప‌దేళ్ల బాలిక‌పై 4 నెల‌లుగా అత్యాచారం చేయ‌డంతో బాలిక గర్భం దాల్చడం కలకలం రేపుతోంది. శనివారం బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం బయటకొచ్చింది.

వివ‌రాల్లోకి వెల్తే…మహారాష్ట్రలోని పల్ఘర్‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బాధిత బాలిక, బాలుడు ఇరుగు పొరుగు వారే. గ‌త నాలుగు నెల‌లుగా బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు.ఇదే స‌మ‌యంలో బాలిక‌కు క‌డుపునొప్పి రావ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రికి తీసుకెల్లారు. బాలిక‌ను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆమె గర్భంతో ఉన్నట్టు తెలిపారు.వైద్యులు చెప్పింది విని షాక్‌కు గురైన తల్లిదండ్రులు తేరుకుని ఏం జరిగిందంటూ బాలికను ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. త‌న‌పై ఓ కుర్రాడు నాలుగు నెల‌లుగా అత్యాచారం చేస్తున్నాడ‌ని తెలిపింది.కుమార్తె చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడైన మైనర్ బాలుడిపై ఐపీసీ 376, పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికైతే బాలుడిని అరెస్ట్ చేయలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -