Monday, May 5, 2025
- Advertisement -

తెదేపాలోకి వచ్చి ఎంపీ టికెట్‌ దక్కించుకున్నారు!

- Advertisement -

ఎంపీల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుక్షవరం పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి మల్లారెడ్డి కూడా తాజాగా తెరాస తీర్థం పుచ్చుకోవడంతో ఈ లాంఛనం ముగిసింది. తెలంగాణలో దుకాన్‌బంద్‌ దిశగా తెలుగుదేశం ప్రస్థానంలో ఇది మరొక కీలకమైన ముందడుగు అనుకోవాల్సిందే. నిజానికి ఎంపీ మల్లారెడ్డి తెరాసలో చేరిపోవడం అనే ఘట్టం ఏడాది ముందే జరిగి ఉండాల్సింది అనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనికి సరైన తర్కం కూడా ఉంది.

విద్యాసంస్థల అధినేత అయిన మల్లారెడ్డి స్వతహాగా తెలుగుదేశం కార్యకర్త కాదు. తన వియ్యంకుడు అయిన తీగల కృష్ణారెడ్డి ప్రోద్బలంతా సరిగ్గా ఎన్నికల ముందు తెదేపాలోకి వచ్చి ఎంపీ టికెట్‌ దక్కించుకున్నారు. పార్టీ మీద పెద్దగా మమకారం ఉన్న వ్యక్తి కాదు. అలాంటి నేపథ్యంలో ఎంతోకాలంనుంచి పార్టీలో ఉన్న తీగల కృష్ణారెడ్డే స్వయంగా తెరాసలోకి వెళ్లిపోయిన తర్వాత ఎంపీ మల్లారెడ్డి కూడా ఎక్కువ కాలం ఆగకపోవచ్చునని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే ఆ పరిణామం జరగలేదు. 

తెలుగుదేశాన్ని తెలంగాణలో బలోపేతం చేసుకోవడానికి తమకున్న ఒకే ఒక్క ఎంపీ మల్లారెడ్డికి కేంద్రంలో మంత్రిపదవి లేదా మరేదైనా కీలక పదవి ఇప్పిస్తానంటూ చంద్రబాబు ఆయనను ఊరించారని ప్రచారం జరిగింది. ఓ దఫా తెతెదేపా నేతలతో చంద్రబాబు భేటీలోనూ మల్లారెడ్డికి కేంద్రమంత్రిపదవి విషయం బాగా చర్చకు వచ్చింది. అయితే తెలంగాణ కోటాలో ఎంపీగా ఉన్న సుజనాచౌదరికి ఎక్స్‌టెన్షన్‌ ఉండదనే ప్రచారం నేపథ్యంలో, ఆయన మంత్రి పదవి ఖాళీ అయితే తనకు దక్కుతుందనే మల్లారెడ్డి నిరీక్షించారు. సుజనాను మళ్లీ చంద్రబాబు నెత్తిన పెట్టుకుని ఏపీ నుంచి టికెట్‌ ఇవ్వడంతో మల్లారెడ్డికి క్లారిటీ వచ్చింది. ఇక తెదేపాలో ఉండడం వలన ప్రత్యేకంగా ఎలాంటి లాభం ఉండదనే ఉద్దేశంతోనే బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న తెరాసలో చేరిపోయినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -