Sunday, May 4, 2025
- Advertisement -

రాష్ట్ర ఆవిర్భావం రోజే ముహుర్తం

- Advertisement -

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు సిహెచ్.మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీల పేరుతో ఆయనకు ఎన్నో ఇంజనీరింగ్, దంత వైద్య కళాశాలలున్నాయ.

ఇటీవల ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సన్నిహితులతో చర్చించిన మల్లారెడ్డి ఇక పార్టీ మారడమే తరువాయి. టిఆర్ఎస్ అగ్రనాయకత్వంతో కూడా చర్చలు జరిపారని, మల్లారెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఖాయమని ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -