Monday, April 29, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ చేస్తే నీతి.. ఇతరులు చేస్తే అవినీతా ?

- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ బీజేపీ మద్య నడుస్తున్న రాజకీయ రగడ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు లో జరిగిన సభలో కే‌సి‌ఆర్ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని కుల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, నలుగురు టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూశారని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కనకాపూర్ లో పర్యటించిన ఆయన.. కే‌సి‌ఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ” సంతలో పశువుల్లా 37 మంది ఎమ్మెల్యేలను కొనుగులు చేసిన కే‌సి‌ఆర్ నీతిమంతుడా ? ఆయన చేస్తే నీతి ఇతరులు చేస్తే అవినీతా అంటూ ఎద్దేవా చేశారు. .

ఎమ్మెల్యేలను లాక్కునే వైఖరి కే‌సి‌ఆర్ దేనంటూ.. విమర్శలు గుప్పించారు. ఆయన చేసినట్లుగా ఇతరులు చేస్తే కే‌సి‌ఆర్ కు మింగుడు పడడం లేదని, కే‌సి‌ఆర్ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారామా ? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కే‌సి‌ఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో ధోషి గా ఉందని, ఆమెను అరెస్ట్ చేస్తే మళ్ళీ తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు, ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బండి ఆరోపించారు. ప్రజలు కే‌సి‌ఆర్ అవినీతిని గమనిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ, బెంగళూరు డ్రగ్స్ కేసు ను రీ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. త్వరలో కే‌సి‌ఆర్ కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ టి‌ఆర్‌ఎస్ మద్య రాజకీయ వివాదం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కడుపుతున్న ఈ రెండు పార్టీలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

నిన్నెందుకు నమ్మాలయ్యా..జగన్ ?

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -