మహిళలు, అమ్మాయిలపై వేధింపుల పర్వం కొనసాగుతున్నాయి. ఇప్పుడు సాధారణ ప్రజలే కాక ప్రముఖుల పిల్లలకు పాకింది. మొన్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ సోదరికి విమానంలో వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత దంగల్ ఫేమ్ నటిపై కూడా విమానంలో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూతురికి కూడా వేధింపులు చోటుచేసుకున్నాయి.
‘‘ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో, లేకపోతే కిడ్నాప్ చేస్తా, చంపేస్తా’’ అనే వేధింపులు భారతరత్న, రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాకు ఓ యువకుడు పాల్పడ్డాడు. వేధించిన ఆ యువకుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన దేవ్‌కుమార్ సచిన్ ఇంటికి ఫోన్ చేశారని కూతురు సారాకు వేధింపులకు గురి చేశాడు. తనను పెళ్లి చేసుకోకపోతే సారాను కిడ్నాప్ చేస్తానని ఆ యువకుడు బెదిరించాడు. సారా ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆదివారం దర్యాప్తు చేసి దేవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
