Sunday, May 19, 2024
- Advertisement -

చైన్ స్నాచర్ లు గా మారిన భార్యా భర్తా – టీవీ కార్యక్రమాలే ఆధారం

- Advertisement -

మనం అయితే టీవీ లో నేరాలూ ఘోరాలూ వంటి ప్రోగ్రాం లు చూస్తాం చూసి మన పని మనం చేసుకోవడానికి వెళ్ళిపోతాం కానీ ఆ జంట అలా చెయ్యలేదు. అవి అమలు చెయ్యాలి అనుకుంది చేసింది కూడా. 

వివరాల్లోకి వెళితే ఒంటరిగా ఉన్న మహిళల మేడల్లో బంగారు గొలుసులు లాక్కుని వెళ్ళే ఒక ముఠా కోసం ఎప్పటి నుంచో గాలిస్తున్న పోలీసులకి సైతం షాక్ ఇచ్చే విశేషాలు బయట పడ్డాయి.

 ఖమ్మం జిల్లా కి చెందిన బానోతు రవి కారు డ్రైవర్ కాగా డీ ఫార్మసీ విద్యార్ధిని , వరంగల్ అమ్మాయి ఎర్రం రాజేశ్వరి తో రవి కి పరిచయం అయ్యింది. ప్రేమించుకున్న వీరు పెద్దలో నో చెప్పడం తో ఇంట్లోంచి వెళ్ళిపోయారు కూడా. కారు నడపడం లో డబ్బులు సరిగ్గా రావడం లేదు అని కారు కూడా అమ్మేసి టీవీ ప్రోగ్రాం లలో చైన్ స్నాచింగ్ లు చూస్తూ నెమ్మదిగా వాటిని అమలు చెయ్యడం మొదలు పెట్టారు. 

2013 లో హంటర్ రోడ్డు లో ఒక మహిళ మీద తెలివిగా అటాక్ చేసి చైన్ లాక్కు పోయిన వారు నెమ్మదిగా దీనికి అలవాటు పడ్డారు. ఏడాది కాలం లో దాదాపు ఎనభై లక్షల సొత్తు కాజేశారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -