- Advertisement -

సందేశాలు ఇచ్చే దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా..!

- Advertisement -

తన తొలి సినిమా ‘గమ్యం’ తో ప్రత్యేకమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఆ తర్వాత కూడా తన ప్రత్యేక ప్రస్థానంతో సాగుతున్నాడీయన.

వేదం, కృష్ణం వందే జగద్గురుం సినిమాలతో ఈయన ప్రత్యేశైలిని కొనసాగిస్తున్నాడు. ఇటీవలే హిందీలో ‘ఠాగూర్’కు రీమేక్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ను రూపొందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ‘కంచె’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ దర్శకుడితో సినిమా కోసం ఉవ్విళ్లూరుతున్నాడట జూనియర్ ఎన్టీఆర్.

ప్రస్తుతం తారక్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది కాస్తా పూర్తి అయిన తర్వాత కొరటాల శివతో సినిమా చేయడానికి ఉత్సాహంతో ఉన్నాడు జూనియర్. అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్- క్రిష్ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

అయితే క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అంటే ఇదొక డిఫరెంట్ కాంబినేషనే… ఎన్టీఆర్ దేమో మాస్ శైలి. క్రిష్ దేమో సందేశాత్మక శైలి. అందులోనూ క్రిష్ సినిమాలేవీ కమర్షియల్ గా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. గమ్యం మినహా మిగతా సినిమాలేవీ పెట్టిన బడ్జెట్ కు లాభాలను ఆర్జించలేకపోయాయి. మరి మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తో ఈ దర్శకుడి సినిమా ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -